MBNR: మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలపై చర్యలేవని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు గురువారం విమర్శించారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఆయన కుర్చీకి గురువారం వినతిపత్రం సమర్పించారు. దీనిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.