MBNR: కాంగ్రెస్ అధిష్టానం రైతుల విషయంలో తన వైఖరిని మార్చుకోవాలని మాజీ ఎంపీపీ సుధా శ్రీ రాఘవేందర్ గౌడ్ అన్నారు. ఈ మేరకు నిన్న ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. యూరియా విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూడా ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదని, వెంటనే రైతులందరికీ సరిపడా యూరియా సరఫరా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.