KRNL: ఉపాధ్యాయుడిపై విద్యార్థి దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ ఖండించారు. కృష్ణా జిల్లా వీరవల్లి బాబులపాడు మండలంలోని జడ్పీహెచ్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి టీచర్‌పై దాడి చేయడం బాధాకరమన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగంపై ఉందన్నారు. పిల్లలను తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచాలన్నారు.