ELR: జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణకు వినతిపత్రాన్ని అందజేశారు. పట్టణంలో ఆక్రమణలకు గురైన రహదారిని స్వాధీనం చేసుకోవాలన్నారు. అలాగే, మాంస విక్రయ దుకాణాలు విడిగా నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బైనేరు శివాలయం వద్ద ఉన్న వ్యర్ధాలను తొలగించి పట్టణ ప్రజలకు కుక్కల బెడద నుంచి విముక్తి కలిగించాలని కోరారు.