NDL: గడివేముల మండలం గడిగరేవులలోని శ్రీ దుర్గా భోగేశ్వర స్వామికి ఫాల్గుణ మాసం గురువారం సందర్భంగా శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు, అర్చనలు జరిగాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు దుర్గ భోగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.