సత్యసాయి: ధర్మవరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మంత్రి సత్యకుమార్ ఆశీస్సులతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని హరీష్ బాబు ప్రారంభించారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు, కార్మికులు, విద్యార్థుల సౌకర్యార్థం వడ్డే శ్రీనివాసులు, బోయ నరసింహులు ఆధ్వర్యంలో ఈ తాగునీటి సౌకర్యం కల్పించారు. ప్రజలకు సేవ చేయడం గొప్ప మానవతా దృక్పథమని హరీష్ బాబు పేర్కొన్నారు.