లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్ ఇవాళ ఉ.10 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఓట్ల చోరీ విషయంలో హైడ్రోజన్ బాంబు పేలుస్తానంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఈ నెల 24న బీహార్ పాట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్, ఇతర నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో బీహార్ ఎన్నికలు, ఓట్ల చోరీ ఉద్యమంతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు.