TG: హైదరాబాద్లో ఎండలు మార్చిలోనే తీవ్రరూపం దాల్చాయి. సాధారణంగా మే నెలలో ఉండే విద్యుత్ డిమాండ్, ఈసారి మార్చిలోనే 4,421 మెగావాట్లకు చేరి పాత రికార్డులను అధిగమించింది. ఏసీలు, కూలర్ల వాడకం పెరగడంతో సబ్ స్టేషన్లపై భారం పెరిగి ఇప్పటినుంచే అక్కడక్కడ విద్యుత్ కోతలు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో డిమాండ్ 5,000 మెగావాట్లు దాటే అవకాశం ఉందని అంచనా.