TG: HYD ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో జరిగిన దాడిని నిరసిస్తూ ప్రజా సంఘాల జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహం నుంచి సచివాలయం వైపు వెళ్లేందుకు యత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. నిందితులను కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు.