KRNL: భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తూ ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైన భర్త కనకం కృష్ణయ్యకు నంద్యాల కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. రాజేశ్వరిని భర్త కనకం కృష్ణయ్య అదనపు కట్నం కోసం వేధించారు. మనస్తాపానికి గురైన ఆమె 2022లో విషద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.