»Arjun Tendulkar Debut For Mumbai Indians Ipl 2023
Arjun Tendulkar: ముంబై ఇండియన్స్ తరపున అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ
సచిన్ టెండూల్కర్ కుమారుడు.. అర్జున్ టెండూల్కర్(arjun tendulkar) IPL 2023లో ఎంట్రీ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబై తరఫున ఎంపికయ్యాడు. అయితే రోహిత్ శర్మకు కడుపునొప్పి రావడంతో జట్టుకు దూరమైన క్రమంలో అర్జున్ ఎంపికైనట్లు తెలిసింది.
ప్రముఖ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు.. అర్జున్ టెండూల్కర్(arjun tendulkar) ఇండియన్ ప్రీమియర్ లీగ్(ipl 2023)లో అరంగేట్రం చేశాడు. ఆదివారం వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాడు. దీంతో సచిన్, అర్జున్ టెండూల్కర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన మొదటి తండ్రీ కొడుకులుగా నిలిచారు. సచిన్ టెండూల్కర్ 2008 నుంచి 2013 వరకు MI కోసం ఆడాడు.
కడుపునొప్పి కారణంగా ఈ మ్యాచుకు రోహిత్ శర్మ(rohit sharma) లేకపోవడంతో సూర్యకుమార్ యాదవ్ స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ క్రమంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా అర్జున్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ముంబై టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అర్జున్ MI కోసం బౌలింగ్ ప్రారంభించాడు. పవర్ ప్లేలో రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు.
అర్జున్ టెండూల్కర్ ఇప్పటి వరకు 7 లిస్ట్ A మ్యాచ్‌లు, 9 T20 మ్యాచ్‌లు ఆడాడు. అతను 4.98 ఎకానమీతో లిస్ట్ Aలో 8 వికెట్లు తీశాడు. మరోవైపు, అర్జున్ టీ20లో 12 వికెట్లు తీయగా, అతని ఎకానమీ 6.60గా ఉంది. అతని ఆటతీరులోని విశేషమేమిటంటే ఇప్పటివరకు అతని ఎకానమీ ప్రతి మ్యాచ్‌లోనూ ఆకట్టుకుంటుంది. అతను ఇప్పటివరకు వన్డేలు, టీ20లు రెండింటిలోనూ నిరూపించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ ఫార్మాట్లో అతను 3.42 ఎకానమీ వద్ద 12 వికెట్లు తీసుకున్నాడు. దీంతోపాటు ఒక సెంచరీతో సహా 223 పరుగులు చేశాడు. ప్రస్తుతం అర్జున్ అతని అత్యధిక స్కోరు 120. ఐపీఎల్ 2021 వేలంలో అర్జున్ను తొలిసారిగా ముంబై ఇండియన్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2021 వేలంలో అర్జున్ను తొలిసారిగా ముంబై ఇండియన్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఎడమచేతి వాటం పేసర్ అర్జున్(arjun) 2021లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా ముంబై తరఫున T20 అరంగేట్రం చేశాడు. మూడు ఓవర్లలో 34 పరుగులకు ఒక వికెట్ తీసుకున్నాడు. 2022-23 దేశవాళీ సీజన్‌కు ముందు గోవా తరపున ఆడేందుకు అర్జున్ రాజస్థాన్‌పై రంజీ ట్రోఫీ అరంగేట్రంలో సెంచరీ చేశాడు.