SRD: సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలోని శ్రీ వెంకటాచలం క్షేత్రంలో ఈనెల 15 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ ప్రతినిధులు శనివారం తెలిపారు. ఈ మేరకు ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఈనెల 15న గురువారం స్వామివారి అభిషేకం, పల్లకి సేవ, అంకురార్పణం, 16న ద్వజారోహణ, శేష వాహన సేవ, 17న శ్రీవారి కళ్యాణం, గరుడ వాహన సేవ, 18న శ్రీ పుష్పయాగం ఉంటుందన్నారు.