SRCL: కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే రైతుల ధాన్యంలో ఎలాంటి కోతలు విధించవద్దని రైస్ మిల్లర్లను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. చందుర్తి మండల కేంద్రం, మూడపల్లి, మర్రిగడ్డ, మల్యాల, కోనరావుపేట మండలం బావుసాయిపేట వట్టిమల్ల, గొల్లపల్లి, నిమ్మపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తనిఖీ నిర్వహించారు.