GNTR: ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూళ్లలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డీఈవో (డేటా ఎంట్రీ ఆపరేటర్)ల నియామకానికి సంబంధించి ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన ప్రకటనతో జిల్లా విద్యాశాఖకు ఎలాంటి సంబంధం లేదని జిల్లా విద్యాశాఖాధికారి సి.వి. రేణుక శనివారం స్పష్టం చేశారు. ఈ తరహా ప్రకటనల పట్ల నిరుద్యోగ యువతీ, యువకులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.