W.G: భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారిని రాజ్యసభసభ్యులు పాక వెంకట సత్యనారాయణ శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ వారికి శేషవస్త్రం ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందించి సత్కరించారు. ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.