టాలీవుడ్లో ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ సినిమాలో రామ్ గోపాల్ వర్మ కనిపించనున్నారని తెలుస్తోంది. అసలే వర్మ ఎప్పుడేం చేస్తాడో ఎవరికీ అర్థం కాదు. ఏం చేసినా అందులో కాంట్రవర్శీ ఉండాలి. లేకుంటే వర్మకు నిద్ర పట్టదు. అందుకే గత కొన్నాళ్లుగా కాంట్రవర్సీతోనే కాపురం చేస్తున్నాడు వర్మ. సినిమాల కంటే వివాదాలతోనే బండి లాగిస్తున్నాడు వర్మ. అలాగే అప్పుడప్పుడు చిత్ర విచిత్రంగా చిందులేస్తు ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు గెస్ట్ రోల్ చేసేందుకు ఓకే చెప్పాడట. అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసం గెస్ట్‌గా మారబోతున్నాడట ఈ కాంట్రవర్శీ కింగ్. సినిమాల్లో కనిపించడం వర్మకు కొత్త కాకపోయినా.. ప్రభాస్ సినిమాలో అనే న్యూస్ కాస్త షాకింగ్‌గానే ఉంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘ప్రాజెక్ట్ K’ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోంది. వైజయంతి బ్యానర్ పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీపికా పదుకునే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తుండగా.. దిశా పటాని మరో కీ రోల్ ప్లే చేస్తోంది. ఇక ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అథితి పాత్రలో కనిపించనున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది. రీసెంట్గా ‘ప్రాజెక్ట్ కె’లో ఒక చిన్న పాత్ర కోసం చిత్ర యూనిట్ వర్మను సంప్రదించినట్టు టాక్. ఆర్జీవీ సైతం అందుకు ఓకే చెప్పాడట. త్వరలోనే తన పార్ట్ షూటింగ్ కూడా చేయనున్నారట. ఇదే నిజమైతే.. వర్మ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ న్యూస్ కేవలం పుకారేనా.. లేక నిజముందా అనేది తెలియాల్సి ఉంది.