CBI : వివేక హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా సంచలనం రేపుతోన్న మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో ఆదివారం సంచలన పరిణామం జరిగింది. వైఎస్ భాస్కర్ రెడ్డి(YS Bhaskar Reddy)ని సీబీఐ అరెస్ట్ చేసింది. కీలక సూత్రధారిగా ఆయనను సీబీఐ గుర్తించింది. గతంలో పలుమార్లు భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు (CBI notices) జారీ చేసి ప్రశ్నించింది.
దివంగత మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(murder case) లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆదివారం ఉదయం పులివెందుల(Pulivendula)లో ఆయనను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి(PA Raghava Reddy)ని కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయమే పులివెందులలోని ఇంటికి చేరుకున్న గంటకుపైగా విచారించిన అనంతరం ఆయన్ని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ప్రస్తుతం కడపకు సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డిని తరలిస్తున్నారు. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆయనను సీబీఐ గుర్తించింది. గతంలో పలుమార్లు ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేసి ప్రశ్నించింది. వివేకా హత్య కేసులో ఆయన పాత్ర ఉన్నట్లు సీబీఐ తేల్చింది. దీంతో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఈ కేసులో కీలకంగా మారింది. భాస్కర్ రెడ్డి అరెస్ట్‌తో ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy)ని కూడా అదుపులోకి తీసుకునే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.