MBNR: జడ్చర్ల మండలం రామస్వామి గుట్ట తండాలో దుర్గామాత, సంత్ సేవాలాల్ మహారాజ్ జాతర బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయి . గురువారం ఉదయం అమ్మవారికి అభిషేకం, పల్లకి సేవ నిర్వహించనుండగా, సాయంత్రం 4 గంటలకు హారతి, శకటోత్సవం చేపట్టనున్నట్లు పూజారి చందు భగత్ తెలిపారు. భక్తుల కోసం అన్ని రకాల వసతులు కల్పించినట్లు ఆలయ కమిటీ పేర్కొంది.