»Twists Upon Twists In The Tspsc Paper Leakage Case
TSPSC : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ట్విస్ట్లు మీద ట్విస్ట్లు
టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ల లీక్ తీవ్ర సంచలనం సృష్టించినది తెలిసిందే. దీనిపై సిట్దర్యాప్తులో భాగంగా బోర్డు ఉద్యోగులతోపాటు మొత్తం 17 మందిని అరెస్టు చేసింది. చివరగా అరెస్టు అయిన సుస్మిత, లౌకిక్దంపతులను కోర్టు అనుమతితో శుక్రవారం కస్టడీకి తీసుకుని విచారించారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కల్గించిన టీఎస్ పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాలు లీక్ (papers leaked) కేసులో తవ్వే కొద్దీ కొత్త ట్విస్ట్ లు వెలుగు వస్తున్నాయి. అరెస్టయిన లౌకిక్, సుస్మిత దంపతులను శుక్రవారం సిట్అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు తెలిశాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్(Group 1 Prelims) రాసిన సుస్మిత తన భర్తతో కలిసి బోర్డుకు వచ్చింది. అక్కడ బోర్డు ఉద్యోగి ప్రవీణ్పరిచయమయ్యాడు. వారికి డీఏఓ పరీక్ష(DAO test) పేపర్ కూడా అమ్మినట్టుగా వెల్లడైంది. దీంతో ప్రవీణ్ఇంకా ఎంతమందికి? ఏయే పరీక్షల పేపర్లు అమ్మాడు? అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. దాదాపుగా దర్యాప్తు ముగింపు దశకు వచ్చిందనుకునేలోపు సిట్అధికారులకు తాజా పరిణామాలతో విచారణ (investigation) ఇప్పట్లో ముగిసేలా లేదని భావిస్తున్నారు.
లౌకిక్, సుస్మితలను ఒకేసారి సిట్ అధికారులు విచారించగా సరికొత్త అంశాలు వెలుగు చూశాయి. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. సుస్మిత గ్రూప్1 ప్రిలిమ్స్పరీక్ష రాసినట్టుగా వెల్లడైంది. అయితే.. పేపర్ లో జంబ్లింగ్ (Jumbling) వివరాల నమోదులో చేసిన పొరపాటుతో బోర్డు రిజల్ట్హోల్డ్లో పెట్టింది. దీనిపై లౌకిక్, సుస్మిత అసలేమైందనేది తెలుసుకునేందుకు బోర్డుకు వచ్చారు. ఉద్యోగి ప్రవీణ్పరిచయమై.. జంబ్లింగ్లో చేసిన పొరపాటుతోనే రిజల్ట్హోల్డ్ (Hold the result) లో పెట్టినట్టు వారికి చెప్పి.. లౌకిక్మొబైల్నెంబర్తీసుకున్నాడు. వారు ప్రవీణ్ తో రెండుమూడు సార్లు ఫోన్ లో మాట్లాడిన తర్వాత గ్రూప్1 ప్రిలిమ్స్పోతే పోయింది.. తన వద్ద డీఏఓ పరీక్ష పేపర్లు ఉన్నాయని, కావాలంటే ఇస్తా.. అని చెప్పగా అంగీకరించారు. మళ్లీ లౌకిక్, సుస్మితలను తన వద్దకు పిలిపించుకున్న ప్రవీణ్ రూ. 6 లక్షలకు బేరం కుదుర్చుకుని డీఏఓ పరీక్ష (Dao exam) పేపర్ 3 సెట్లను ఇచ్చాడు. దీంతో సుస్మిత డీఏఓ పరీక్ష రాసింది. ఇక జాబ్ ఖాయమనుకుని సుస్మిత దంపతులు తిరుపతి(Tirupati) తో పాటు ఇతర పుణ్యక్షేత్రాలను సందర్శించారు.