Group-2: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. సో.. గ్రూప్-2 పరీక్ష (Group-2) వాయిదా పడింది. ఎగ్జామ్ నిర్వహణ కోసం దాదాపు 50 వేల మంది సిబ్బంది అవసరం అవుతారు. అంతమందిని సర్దుబాటు చేయడం వీలు కాదని, కలెక్టర్లు కమిషన్కు తెలియజేశారు. దీంతో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నామని టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2, 3వ తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉంది. దానిని వచ్చే ఏడాది జనవరి 6, 7వ తేదీకి వాయిదా వేశామని కమిషన్ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ఎన్నికల విధుల్లో పోలీసులు కూడా బిజీగా ఉంటారు. తగిన బందోబస్త్ కల్పించలేమని జిల్లా ఎస్పీలు కూడా సందేహాలు వ్యక్తం చేశారు. కలెక్టర్లు, ఎస్పీల అభిప్రాయం తీసుకున్న తర్వాత పరీక్ష వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుని ప్రకటన విడుల చేశారు.
ఇప్పటికే గ్రూప్-1 పేపర్ లీకేజీతో మరోసారి నిర్వహించారు. దానిని కూడా రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం కూడా అంగీకరించింది. ఆ ఇష్యూతో వాదనలు జరుగుతున్నాయి. కానిస్టేబుల్ రిజల్ట్ వచ్చింది.. కానీ నియామకం జరగలేదు. ఇప్పుడే షెడ్యూల్ రావాలా అని నిరుద్యోగులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నుంచి ఇదే పరిస్థితి అని.. మరో 4 నెలల్లో పరీక్ష నిర్వహించినప్పటికీ రిక్రూట్ అయ్యేవరకు మరో 6 నెలలు పడుతుందని చెబుతున్నారు. ఇలా తమ లైఫ్లో దాదాపు రెండేళ్లు సమయం వృధాగా గడిచిపోయిందని అంటున్నారు.