ప్రకాశం: రాచర్ల మండలంలో ఫోర్జరీ సంతకాలతో భూమిని కబ్జా చేసి, ప్రశ్నించిన వ్యక్తిని కులం పేరుతో దూషించిన ఘటనలో రామయ్య అనే వ్యక్తి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. బుధవారం మార్కాపురం డీఎస్పీ నాగరాజు మండలంలోని ఆకవీడు గ్రామానికి వెళ్లి బాధితులను విచారించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. ఈ విచారణలో గిద్దలూరు సీఐ రామకోటయ్య పాల్గొన్నారు.