KRNL: జాతీయ లోక్ అదాలత్లో కర్నూలు, నంద్యాల జిల్లాలో 8,122 కేసులు పరిష్కరించామని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి తెలిపారు. శనివారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు భూసేకరణ బాధిత రైతులైన 60 మందికి రూ.83.96 లక్షల నష్టపరిహారం అందజేశారు.