W.G: జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణపై రూపొందించిన అవగాహన పోస్టర్ను కలెక్టర్ నాగరాణి శనివారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 14 వరకు పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ఉచిత టీకాలు వేస్తారని ఆమె తెలిపారు. పశువుల యజమానులందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.