AKP: మాడుగుల గాంధీ పార్కులో బుధవారం సర్పంచ్ యడ్ల కళావతి, ఉపసర్పంచ్ జవ్వాది వరహాలు ఆధ్వర్యంలో ప్రత్యేక గేట్లను ఏర్పాటు చేశారు. పార్కులో కొంత మంది ద్విచక్ర వాహనాలను నిలపడంతో లోపలికి వెళ్లి కూర్చునే వారు అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. అటువంటి ఇబ్బందుల దృష్ట్యా పార్కులో రెండు వైపులా వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేని గేట్లను ఏర్పాటు చేయడం జరిగింది.