SKLM: మత్స్యకారుల శ్రమకు బలమై, సంక్షేమానికి తోడుగా నిలిచే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఎచ్చెర్ల MLA ఈశ్వరరావు పేర్కొన్నారు. శనివారం రణస్థలం మండలం జీరుపాలెంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) పధకం ద్వారా 50% రాయితీ పై ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 43 లబ్ధిదారులకు పరికరాలు అందజేశారు.