SRD: పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి చిట్కుల్ లక్ష్మీనగర్ కాలనీకి చెందిన జ్ఞానేశ్వర్ కుమార్తె ధీరజ (19), సంగారెడ్డి తార డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం కాలేజీకి వెళ్తానని చెప్పి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.