CTR: పుంగనూరు మండలంలో శుక్రవారం రాత్రి వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక సురేంద్ర అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే రెండేళ్ల క్రితం పురుషోత్తం కోసం తీసుకున్న రూ.50 వేలు 5 నెలల క్రితమే తిరిగి చెల్లించినా, వడ్డీ వ్యాపారులు అదనంగా రూ.75 వేలు చెల్లించాలని బెదిరించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.