అన్నమయ్య: ఆడపిల్లలే దేశానికి అసలైన ఆస్తి అని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు. శుక్రవారం మదనపల్లె లోని CDPIO కార్యాలయంలో అంగన్వాడి, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలతో సమావేశం నిర్వహించారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాలపై అవగాహన కల్పించారు. పుట్టబోయే బిడ్డ ఆడ లేదా మగ అని తెలుసుకోవడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.