BHPL: జిల్లా కేంద్రంలోని ఈవీఎం, వీవీ ప్యాట్ గోదాంను శుక్రవారం జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ యంత్రాల భద్రత, సీసీ కెమెరా పర్యవేక్షణ, సీల్ వేసిన తాళాలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం సిబ్బంది, రాజకీయ నేతలు ఉన్నారు.