BHPL: రేగొండ మండల కేంద్రంలో శుక్రవారం BHPL కళా రంజని బృందం ఆధ్వర్యంలో HIV/ AIDS పై కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాబృందం పాటల రూపంలో HIV వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఇది అంటువ్యాధి కాదని, నిర్దిష్ట కారణాల వల్ల మాత్రమే వ్యాపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.