NLR: విడవలూరు మండలంలోని పార్లపల్లి గ్రామంలో శుక్రవారం అధికంగా యూరియా వాడకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు అవగాహన చేస్తూ ర్యాలీ చేశారు. మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ మాట్లాడుతూ… ప్రకృతి వ్యవసాయంపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలన్నారు. అధికంగా యూరియా వాడకూడదని తెలియజేశారు. రైతులందరూ కూడా యూరియా వినియోగాన్ని తగ్గించాలన్నారు.