GNTR: తెనాలిలోని సాలిపేటలో ఉన్న 39వ నంబర్ రేషన్ షాపును సీజ్ చేసినట్లు శుక్రవారం తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఈ రేషన్ షాపులో తనిఖీలు నిర్వహించగా “నో స్టాక్” బోర్డు ఉండటంతో పాటు, డీలర్‌పై పలు ఫిర్యాదులు ఉన్నట్లు గుర్తించామన్నారు. మండల పరిధిలోని ఇతర రేషన్ డీలర్లపై కూడా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.