NGKL: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. జుమా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీ జుమా మసీద్ నుంచి ప్రారంభమైంది. పిల్లలు, యువకులు, పెద్దలు జెండాలు పట్టుకొని భక్తిశ్రద్ధలతో ప్రవక్త ప్రవచనాలను ఉచ్చరిస్తూ ముందుకు సాగారు. పట్టణంలో ప్రధాన రహదారుల గుండా సాగిన ఈ ర్యాలీ ఆకట్టుకుంది.