MLG: జిల్లా కేంద్రంలో శుక్రవారం తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డా. అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మేడారం గద్దెల మార్పిడిలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివాసీ పెద్దలు, తలపతుల అభిప్రాయాలను పరిగణించాలని, కోయ మూలాలను విస్మరిస్తే ఆలయ గుర్తింపు కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.