KMM: పాలేరు డివిజన్లో అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పని నిర్వహించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్ తమ్మినేని సుబ్బయ్య భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 200 రోజులు పని దినాలు కల్పించాలని, ప్రతి కూలీకి రోజువారి వేతనం రూ.600 చెల్లించాలన్నారు.