KDP: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని SI తిరుపాల్ నాయక్ హెచ్చరించారు. ఇవాళ గండి – పులివెందుల బైపాస్ రోడ్డు సమీపంలో జూదం ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. వీరి వద్ద నుంచి రూ. 82,300 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎస్సై స్పష్టం చేశారు.