VSP: భీమిలి ప్రభుత్వ టీచర్ ట్రైనింగ్ కళాశాలలో రెండవ రోజు శుక్రవారం కళా ఉత్సవ్-2025 కొనసాగింది. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసే విధంగా చిత్రలేఖనం శిల్పకళ నాటిక పోటీలు నిర్వహించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 20 పాఠశాలల నుంచి 40 మంది ఉపాధ్యాయులు, 150 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విజేతలకు ప్రిన్సిపాల్ సుధాకర్ బహుమతులు అందజేశారు.