GDWL: జిల్లాలో కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన టీ. వెంకటేశ్వర్లును జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం అభినందించారు. పదోన్నతులు పోలీసులకు గుర్తింపుతో పాటు విధుల పట్ల మరింత ఉత్సాహాన్ని ఇస్తాయని ఎస్పీ అన్నారు. పదోన్నతితో బాధ్యత కూడా పెరుగుతుందని, ఆ బాధ్యతను క్రమశిక్షణతో నిర్వహించాలని పేర్కొన్నారు.