PPM: జిల్లాలోని రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూరియా, ఎరువులు పంపిణీ చేయాలని జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాలకొండ రెవిన్యూ డివిజన్లోని వీరఘట్టం రైతు సేవా కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ చేస్తున్న ఎరువుల పంపిణీ ప్రక్రియను జేసీ స్వయంగా పరిశీలించారు. ఎరువుల కొరకు రైతులు వేచి ఉండకూడదన్నారు.