KDP: కొండాపురం మండలంలోని చౌటిపల్లె ఆర్ఆర్ కాలనీ వాసులు రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని, వర్షం వస్తే నీరు నిలిచి విషపురుగులు తిరుగుతున్నాయని, దీంతో ప్రజలు, పిల్లలు అనారోగ్యాల పాలవుతున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి రోడ్లు నిర్మించాలని కోరుతున్నారు.