MDK: తూప్రాన్ పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్ యాజమాన్యానికి రూ. 5 వేల జరిమానా విధించినట్లు మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీ అనుమతి లేకుండా సూపర్ మార్కెట్ ముందు ఉన్న చెట్టు కొమ్మలను నరికి వేసినట్టు వివరించారు. చెట్టు కొమ్మలు నరికి వేసిన వ్యాపార సముదాయానికి జరిమానా విధించినట్టు పేర్కొన్నారు.