అమెరికా సెనేటర్ బిల్ హాగెర్టీ చైనాపై సంచలన ఆరోపణలు చేశారు. ఐదేళ్ల క్రితం సరిహద్దు ఘర్షణల్లో భారత సైనికులను కరిగించడానికి చైనా విద్యుదయస్కాంత ఆయుధాలను ఉపయోగించిందని ఆయన పేర్కొన్నారు. పరోక్షంగా 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలను ప్రస్తావించారు. ఆ ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ ఆరోపణలు భారత్-చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.