TG: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గుందా? అని కేటీఆర్ అనడం విడ్డూరమని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. గతంలో BRS 88 స్థానాల్లో గెలిచి కూడా ఇతర పార్టీ MLAలను చేర్చుకోలేదా? అప్పుడు మీకు సిగ్గులేదా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందే BRS అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టప్రకారమే చేస్తుందన్నారు.