NRML: అంగన్వాడీల అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హామీ ఇచ్చారు. ఖానాపూర్ డివిజన్లోని అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వారి సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఖానాపూర్ ప్రాజెక్టుకు రెగ్యులర్ సీడీపీవోను నియమించాలని, ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు నెలసరి రూ. 18 వేల వేతనం చెల్లించాలన్నారు.