ADB: ప్రజలు తమ ఇంటి పరిసర ప్రాంతంలో పిచ్చిమొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని, దీంతో దోమలు రాకుండా ఉంటాయని హెచ్ఈవో రవీందర్ సూచించారు. శుక్రవారం నేరడిగొండ మండలంలోని కుప్టి గ్రామంలో ‘డ్రైడే-ఫ్రైడే’ నిర్వహించారు. ఈ క్రమంలో నిల్వచేసి ఉంచిన వర్షపునీటిని శుభ్రపరిచారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ వజ్ర కాంత, గ్రామస్థులు పాల్గొన్నారు.