సత్యసాయి: తనకల్లు మండలం మండ్లిపల్లి వద్ద 42వ జాతీయ రహదారిపై సిమెంట్ లారీ బొలెరోను ఢీ కొట్టింది. కర్ణాటకలో టమాటాలు విక్రయించి వస్తున్న ముదిగుబ్బ మండలం దొరిగల్లుకు చెందిన ప్రతాప్(28) అక్కడిక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.