ELR: సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఛైర్మన్ రాజన పండు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలకు సంబంధించి పోస్టర్లు ఆవిష్కరించారు. అలాగే దసరా ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని ప్రతిరోజు వివిధ రూపాల్లో అలంకరించడం జరుగుతుందన్నారు.