NTR: జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సిఫార్సు లేఖల ద్వారా సీఎం సహాయ నిధి నుంచి మొత్తం 139 మంది లబ్ధిదారులకు రూ.66 లక్షలు మంజూరయ్యాయి. ఈ రోజు ఎమ్మెల్యే నివాసంలో లబ్ధిదారులకు చెక్కుల రూపంలో అందజేశారు. ప్రజల ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ప్రభుత్వం నుంచి అందించే సీఎంఆర్ఎఫ్ ఎంతో సహాయకారిగా ఉంటుందని తెలిపారు.