గత ప్రభుత్వాల కాలంలో ధాన్యం కొనుగోలు జరగలేదని, కేసీఆర్ సీఎం అయ్యాకే ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతుల కోసం మాత్రమే సీఎం వేల కోట్లు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు.
రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్(CM KCR) రైతుల కోసం చేసినంతగా దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చేయడం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Ministrer Errabelli) అన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్న రైతు బాంధవుడని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా (Mahbubabad District) తొర్రూరు మండలం కర్కాల గ్రామం,పెద్ద వంగర మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను (Paddy purchase centres) మంత్రి ప్రారంభించారు. రైతులకు పంటల కోసం ప్రభుత్వం ఎదురు పెట్టుబడి పెడుతుందని వెల్లడించారు. ఈ యాసంగిలో 7వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.గత వానా కాలంలో కోటి టన్నుల వరి ధాన్యాన్ని సేకరించామని వివరించారు.రాష్ట్రంలో 24లక్షల టన్నుల నుంచి కోటి 41 లక్షల టన్నులకు వరి ధాన్యం ఉత్పత్తి పెరిగిందని అన్నారు.రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల నుంచి 65 లక్షల ఎకరాలకు వరి సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. ఈ యాసంగి లో వరి ధాన్యం మద్ధతు ధరను ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2060, బి గ్రేడ్ ధాన్యానికి రూ. 2040 నిర్ణయించారని తెలిపారు. రంజాన్ సందర్భంగా పెద్ద వంగరలో ముస్లిములకు ప్రభుత్వ గిఫ్ట్(ramzan thofa)లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.