BJP MLA MP Kumaraswamy రాజీనామా.. పార్టీ వీడుతున్న నేతలు
కర్ణాటక అసెంబ్లీకి బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటిస్తోంది. టికెట్ రానీ నేతలు వరసగా రాజీనామాలు చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామి ఈ రోజు రాజీనామా చేశారు.
BJP MLA MP Kumaraswamy:కర్ణాటక అసెంబ్లీ ఎన్నిలకు సంబంధించి బీజేపీ రెండు విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. టికెట్ రాని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు పార్టీని కూడా వీడుతున్నారు. కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడి (laxman sawadi) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నిన్న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సీఎం బసవరాజు బొమ్మైపై (basavaraju bommai) విమర్శలు చేశారు.
ముడిగెరె ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామి (kumaraswamy) ఈ రోజు బీజేపీకి (bjp) రాజీనామా చేశారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తనకు టికెట్ రాకపోవడానికి కారణం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి (ct ravi) అని ఆరోపించారు. పార్టీ పదవీకి రాజీనామా చేశానని.. రాజీనామా లేఖ పార్టీ కార్యాలయానికి పంపించానని తెలిపారు. ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశానని.. స్పీకర్ను (speaker) కలిసి లేఖ అందజేస్తానని వివరించారు.
తన భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామి (kumaraswamy) తెలిపారు. ఏ పార్టీలో చేరేది.. కార్యాచరణ గురించి త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.
వ్యక్తిగత కారణాలు చూపి సీటీ రవి (ct ravi) తనకు టికెట్ రాకుండా చేశారని కుమారస్వామి (kumaraswamy) ఆరోపించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవీలో ఉండి ఇలా చేయడం సరికాదన్నారు. కర్ణాటకలో బీజేపీని సీటీ రవి నిర్వీర్యం చేస్తున్నారని కుమారస్వామి (kumaraswamy) ఆరోపించారు.